వనరు

మీ సైట్‌ను AdSense కోసం ఎలా అత్యుత్తమంగా ఫార్మాట్ చేయాలి

రిసోర్స్ ఇమేజ్
ప్రకటన ఆప్టిమైజేషన్‌లు

మీ AdSense ఆదాయాలు మరింత పెంచుకోవాలనుకుంటున్నారా? AdSenseతో డబ్బు సంపాదించడం కోసం మీ సైట్‌ను ఉత్తమ ఆకారంలో పొందడానికి ఈ 4 చిట్కాలను చూడండి.

Google AdSenseతో డబ్బు సంపాదన విషయంలో, మీ సైట్ లేఅవుట్ అన్నింటిలోకెల్లా అత్యంత ప్రధానమైనది. సందర్శకులు మీ కంటెంట్ చూడలేని స్థాయిలో మీ ప్రకటనలు మీ కంటెంట్‌పై ఆధిపత్యం చూపడం, వారు ఏదైనా క్లిక్ చేద్దామని ఉత్సాహపడే లోపే వారు నిష్క్రమించేలా చేయడాన్ని మీరు ఇష్టపడరు. అదే విధంగా, మీ ప్రకటనలను వారు చూడకుండాపోయేలా సూక్ష్మ రీతిలో వాటిని ఉంచడం కూడా మీరు ఇష్టపడరు. అందుకోసమే, మీ వెబ్‌సైట్‌కు AdSense ఆప్టిమైజేషన్ ముఖ్యమైనది. ఈ విధంగా చేయడానికి కొన్ని ప్రధానమైన Google AdSense చిట్కాలను ఇక్కడ అందిస్తున్నాము.

1. లీడర్‌బోర్డ్ బ్యానర్ కోసం స్పేస్‌ను సృష్టించండి.

పేజీ పైభాగంలో ప్రదర్శించే పెద్ద గ్రాఫిక్ లాగా మీ సైట్ సందర్శకుల దృష్టిని ఆకర్షించేది ఇంకొకటి ఏదీ లేదు. AdSense ఆదాయాలను ఆప్టిమైజ్ చేయాలనుకునే చాలా వరకు సైట్‌లకు, సుమారు 728 పిక్సెల్స్ వెడల్పు X 90 పిక్సెల్స్ ఎత్తుతో ఒక లీడర్‌బోర్డ్ బ్యానర్ ఉంటుంది. కొన్ని సైట్‌లకు, అది ఇంకా పెద్దదిగా ఉండవచ్చు.

లీడర్‌బోర్డ్ బ్యానర్ గురించి గొప్ప విషయం ఏమిటంటే ఇది ప్రజల దృష్టిని ఆకర్షించడమే కాదు, ఇది మీ సైట్‌కు గౌరవ బ్యాడ్జ్ లాంటిది. టైమ్ మ్యాగజైన్ లాంటి ప్రచురణ సంస్థలు కొన్నిసార్లు మానిటైజ్ చేయడానికి వారి సైట్ పైభాగంలో పెద్ద ప్రకటనలను ఉపయోగిస్తుంటాయి.

రిసోర్స్ పొందుపరిచిన ఇమేజ్

ఎంటర్‌ప్రెన్యూర్ లాంటి ఇతర ప్రచురణ సంస్థలు కొన్నిసార్లు వాటి హెడర్ దిగువున ప్రామాణిక లీడర్‌బోర్డ్ బ్యానర్‌లను ఉపయోగిస్తాయి.

ఇవి రెండూ కూడా వీక్షకులు మీ కంటెంట్‌ను త్వరగా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తూనే, వారి దృష్టిని కూడా వెంటనే ఆకర్షిస్తాయి. కనుక AdSense ఆదాయాన్ని సంపాదించడానికి ఈ రెండు గొప్ప ఎంపికలుగా నిలుస్తాయి.

2. దీర్ఘచతురస్రాకార లేదా ఆకాశహర్మ్య బ్యానర్ కోసం సైడ్‌బార్‌ను కలిగి ఉండండి.

తర్వాతి Google AdSense చిట్కా ఏమిటంటే, మీ వెబ్‌సైట్‌కు అదనపు బ్యానర్‌లను జోడించడానికి వీలుగా ఒక సైడ్‌బార్ (లేదా రెండు) కూడా కలిగి ఉండాలి. మీరు సెట్ చేసిన సైజ్‌లలోని దీర్ఘచతురస్రాకార లేదా ఆకాశహర్మ్య బ్యానర్‌లను ఎంచుకోవచ్చు లేదా మీ సందర్శకుల డిస్‌ప్లే సైజ్‌కు అనుగుణంగా మారే ప్రతిస్పందనాత్మక బ్యానర్‌లను ఎంచుకోవచ్చు.

AdSense ఆప్టిమైజేషన్ వల్ల ఉండే ప్రయోజనాలే కాకుండా, మీ సైట్‌కు వచ్చే సందర్శకులు, ఇమెయిల్ ద్వారా లేదా సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా మిమ్మల్ని ఎలా అనుసరించవచ్చనే దాని గురించిన సమాచారాన్ని ప్రదర్శించడానికి మీ సైడ్‌బార్(లు)ను ఉపయోగించవచ్చు. ఇది వారు తిరిగి వచ్చి వేర్వేరు ప్రకటనలపై క్లిక్ చేసే అవకాశం ఉందని నిర్ధారిస్తుంది.

3. లింక్ యూనిట్‌ల కోసం మీ ప్రధాన హెడర్ దిగువున ఒక ప్రదేశాన్ని కనుగొనండి.

ఇతరులు మీ AdSense లింక్ యూనిట్‌లను నావిగేషన్ మెనూలుగా భ్రమపడి, వాటిపై క్లిక్ చేసేలా చేయడానికి మీరు ఎలాంటి మాయలు చేయలేరని గుర్తుంచుకోండి. కానీ, బ్లాగ్ మరియు వార్తా సైట్‌లలో మీ కంటెంట్ యొక్క ప్రధాన శీర్షిక దిగువున ఉండే లింక్ యూనిట్‌లు సాధారణంగా బాగా కలిసిపోతాయి, అయితే మీరు సాంప్రదాయకమైన లింక్ కలరింగ్ లేదా మీ సైట్ యొక్క థీమ్‌కు సరిపోలే లింక్ కలరింగ్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది, అవి వేరుగానే కనిపిస్తాయి.

4. మీ కంటెంట్ మధ్యలో లేదా చివరిలో సమతలంగా ఉండే బ్యానర్‌ను జోడించండి.

మీ కంటెంట్ మీ సందర్శకుల దృష్టిని ఆకర్షించడం ప్రారంభించిన తర్వాత మీరు సమతలంగా ఉండే బ్యానర్‌లను రెండు చోట్ల ఉంచవచ్చు. వారు కంటెంట్ చివరకి వచ్చేలా చేయడానికి ఎటువంటి కారణం (చర్చ లేదా కామెంట్ బాక్స్ లాంటివి) లేకపోతే, అప్పుడు దానిని కంటెంట్ మధ్యలో ఉంచండి. అది వారిని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు, దాని వలన మీరు క్లిక్ పొందగలరు.

మీ సైట్ చాలా మందిని ఆకట్టుకుంటుంటే, ఎప్పుడూ చర్చలో ఉంటే, దానిని చివరిలో ఉంచండి. సందర్శకుడు వారి కామెంట్‌ను పోస్ట్ చేసిన తర్వాత సందర్శనను ముగిస్తారు, ఎందుకంటే వారు చివరిగా ఆ చర్య తర్వాత మీ సైట్‌ను నిష్క్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్లు తర్వాత క్లిక్ చేయడానికి వీలుగా ప్రకటన అక్కడ సిద్ధంగా ఉంటుంది.