వనరు
Google AdSense కోసం ఉత్తమ అభ్యాసాలు
Google AdSense కోసం ఉత్తమ అభ్యాసాలు ఏమిటి? AdSenseతో డబ్బు సంపాదించడంలో మీకు సహాయపడటానికి మా సిఫార్సులను చూడండి
Google AdSenseతో డబ్బు సంపాదించడానికి, మీరు ఈ Google AdSense బెస్ట్ ప్రాక్టీసులు ఫాలో అవ్వడం ముఖ్యం. అవి మీరు మీ Google AdSense రాబడిని పెంచుకునేలా హామీ ఇవ్వడం మాత్రమే కాకుండా, మీ సైట్ అభివృద్ధి చెందడం కొనసాగిస్తూ, మరింత ప్రసిద్ధి చెందేలా చేయడంలో కూడా మీకు తప్పకుండా సహాయపడతాయి.
1. వివిధ ప్రకటన యూనిట్లతో ప్రయోగం చేయండి.
సరైన కారణాల వల్లే Google AdSense వివిధ రకాల యాడ్ శైలులను అందిస్తుంది. మీ సైట్కు వచ్చే వివిధ రకాల సందర్శకులు వివిధ రకాల ప్రకటనల పట్ల ఆకర్షితులవుతూ, వాటిపై క్లిక్ చేస్తారు. కొందరు లింక్లపై క్లిక్ చేస్తారు. కొందరు పెద్ద బ్యానర్లపై క్లిక్ చేస్తారు. కొందరు వీడియో బ్లాక్లపై క్లిక్ చేస్తారు.
అంటే, చాలా వరకు యాడ్ శైలి మీదే ఆధారపడదు, కానీ ఆ నిర్దిష్ట శైలిని అనుసరిస్తున్న అడ్వర్టైజర్ మీద, ఆ అడ్వర్టైజర్కు మ్యాచ్ అయ్యే సందర్శకుడి మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఇప్పుడే ప్రముఖ రిటైలర్ సైట్ను సందర్శించిన వ్యక్తి మీ సైట్కు వస్తున్నారనుకోండి. ఆ రిటైలర్ వద్ద నిర్దిష్ట సైజ్లో మళ్లీ మార్కెటింగ్ చేసే ప్రకటనలు ఉంటే, దానికి సరిపోలుతున్న ప్రకటన బ్లాక్ను మీరు ఉపయోగించినట్లయితే, మీ ప్రకటనపై క్లిక్ పొందగల మీ అవకాశాలను మీరు పెంచుకుంటారు.
కనుక విభిన్నమైన ప్రకటన యూనిట్లతో తప్పక ప్రయోగాలు చేయండి. మీ లీడర్బోర్డ్, ఆకాశహర్మ్యం, లింక్ ప్రకటన యూనిట్లు వాటి ఉత్తమ పనితీరును కనబర్చడం మీరు గమనించవచ్చు.
2. మీ సైట్ ఏ రకానికి చెందిందో, ఆ రకమైన సైట్లకు ఏ యాడ్ స్థానాలు అత్యుత్తమంగా మ్యాచ్ అవుతాయో తెలుసుకోండి.
మీ Google AdSense ప్రకటనలను ఎక్కడ ఉంచాలనే విషయం మీకు సరిగ్గా తెలియకుంటే, ఈ వనరులతో ప్రారంభించి వార్తల సైట్లు, వర్గీకరించిన సైట్లు, గేమింగ్ సైట్లు, ఫోరమ్లు, బ్లాగ్లు, క్రీడల సైట్లు, ప్రయాణ సైట్లసంబంధిత ఉత్తమ ప్రకటన స్థానాలను గుర్తించవచ్చు.
మీ ప్రేక్షకులకు ఏది ఉత్తమంగా పని చేస్తుందో తెలుసుకోవడానికి, మీరు కలిగి ఉన్న సైట్లను పోలినట్లుగా ఉండే అత్యంత ప్రసిద్ధి చెందిన సైట్లను కనుగొనడం, వారు ఏమి చేస్తున్నది గమనించడం దీనికి ఉన్న మరొక మార్గంగా అనుసరించవచ్చు. వారు Google AdSenseను ఉపయోగించకపోయినా, వారి ప్రకటనలను వారు ఎక్కడ ఉంచుతున్నది మరింత సన్నిహితంగా పరిశీలించండి. బహుశా, వారి అడ్వర్టైజర్ల కోసం అత్యధిక ఇంప్రెషన్లు లేదా క్లిక్లను అందించే అవకాశం గల స్థలాలకు సంబంధించి వారి హోమ్వర్క్ను వారు పూర్తి చేసి ఉండవచ్చు.
మీ పరిశోధనను మీరు పూర్తి చేసిన తర్వాత, మీరు పరీక్షించడం చేయవచ్చు. ఒక వారం పాటు Google సిఫార్సులను ప్రయత్నించండి, ఆపై ఇతర ప్రసిద్ధ సైట్లు తమ ప్రకటనలను ఒక వారం పాటు ఏర్పాటు చేసేట్లుగానే మీ Google AdSense కూడా ఏర్పాటు చేసేలా చూడండి. ఏయే వారంలో ఉత్తమ ఆదాయలు అందించబడతాయో చూడండి, ఆపై మీ ప్రేక్షకుల కోసం ఉత్తమంగా పని చేయగల లేఅవుట్ ఏదో మీకు తెలుస్తుంది.
3. మీ ప్రకటనలు ప్రతిస్పందనాత్మకంగా ఉండాలో లేదో నిర్ణయించండి.
ముందుగా, వీలైతే మీ సైట్ డిజైన్ను Google సిఫార్సు చేసిన రీతిలో మొబైల్కు అనుకూలంగా, ప్రతిస్పందనాత్మకంగా చేయాలి. కానీ అతిముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, మీ ప్రకటనలు కూడా మార్చాల్సి ఉంటుందా? ముందుగా, మీ ప్రకటనలు ఎలా కనిపిస్తున్నది చూడాలంటే మీ స్మార్ట్ఫోన్లో మీ సైట్ ఎలా కనిపిస్తున్నది మీరు చూడాల్సి ఉంటుంది. మీ వద్ద ఉన్న లీడర్బోర్డ్లకు ముఖ్య శీర్షికకు మధ్య వైరుధ్యం ఏర్పడుతోంటే, స్థిరమైన లీడర్బోర్డ్కు బదులుగా ఒక ప్రతిస్పందనాత్మక లీడర్బోర్డ్ యాడ్ యూనిట్ ను ప్రయత్నించవచ్చు.
కానీ, దాని కంటే ముందుగా మీ సైట్కు, అలాగే మీ AdSense ఆదాయాలు అన్నింటికీ మొబైల్ సందర్శకుల ట్రాఫిక్ ముఖ్యమో కాదో మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీ Google Analyticsకు వెళ్లడం ద్వారా దీనిని మీరు చేయవచ్చు. ప్రత్యేకించి, మీ Google Analytics మరియు AdSense ఖాతాలను ఒక్కటిగా కలపాలని మీరు భావిస్తే, దీని వలన మీ డెస్క్టాప్ వెర్షన్ మీ మొబైల్ యూజర్ల గురించి, వారు ఎంత తరచుగా మీ ప్రకటనలపై క్లిక్ చేస్తున్నారనే విషయాల గురించి మీరు మరింత తెలుసుకోవచ్చు.
మీ ప్రకటనలను మొబైల్కు అనుకూలంగా ఉండేలా మీరు ఆప్టిమైజ్ చేసినట్లయితే, కేవలం డెస్క్టాప్ యూజర్లతోనే కాకుండా అన్నింటిలో కూడా AdSenseతో ఎక్కువ డబ్బు సంపాదించుకోగలిగే అవకాశం మీరు కనుగొనవచ్చు.
4. కొత్త కంటెంట్ను సృష్టించడం కొనసాగించండి.
చాలా రకాల సైట్లు కొత్త సందర్శకులను రప్పించుకోవడానికి, మునుపటి సందర్శకులు మరలా వచ్చేలా ఆకర్షించడానికి కొత్త కంటెంట్ పైన ఆధారపడతాయి. చాలా సందర్భాలలో, కొత్త కంటెంట్ అనేది కొత్త బ్లాగ్ పోస్ట్లు, కొత్త చర్చలు లేదా యూజర్ రూపొందించిన కొత్త కంటెంట్ రూపాలలో ఉంటుంది. మీరు రూపొందించే కంటెంట్ ఏదనే దానితో సంబంధం లేదు, మీరు దానిని క్రమం తప్పకుండా తరచూ రూపొందించేలా చూసుకోండి. దీని వలన మీ సైట్కు సందర్శకులను రప్పించడం మీరు కొనసాగిస్తారు.
మీ కొత్త కంటెంట్ అనేది మీ సైట్కు జనాలను రప్పిస్తుందో లేదో నిర్ధారించుకోవడానికి, Google వెబ్మాస్టర్ మార్గదర్శకాలు ఫాలో కావడం ద్వారా మీరు Google AdWords కీవర్డ్ ప్లానర్ను ఉపయోగించి పరిశోధించిన నిర్దిష్ట కీవర్డ్ పదబంధానికి సంబంధిత శోధన ఇంజిన్లకు దానిని ఆప్టిమైజ్ చేయవచ్చు. ఆప్టిమైజ్ చేసిన కంటెంట్ను మీరు ఎంత ఎక్కువగా సృష్టిస్తే, శోధన ఇంజిన్ యూజర్ల నుండి దీర్ఘ కాలంలో మీరు అంత ఎక్కువ సందర్శనలను పొందుతారు.
కొత్త కంటెంట్ను సృష్టించడంతో పాటుగా, సందర్శకులు మీ సైట్కు తిరిగి రావడానికి ఒక మార్గాన్ని అందించండి. ఇమెయిల్ లేదా ఇతర ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ల ద్వారా మీ సైట్కు సభ్యత్వాన్ని పొందడానికి వారిని ప్రోత్సహించండి, దీని వలన మీరు మీ తాజా కంటెంట్ను వారికి ప్రచారం చేయవచ్చు. మీ అభిమానులను మీరు చేరుకోగలిగే మార్గాలను కలిగి ఉండటమే దీని లక్ష్యం, దీని వలన మీరు వారిని మీ సైట్కు తిరిగి రప్పించవచ్చు, అలాగే వారు మీ మరిన్ని ప్రకటనలపై క్లిక్ చేయగల అవకాశం ఉంటుంది.
5. మీ కంటెంట్ మరియు మీ సైట్ గురించి ప్రచారాన్ని కొనసాగించండి.
మీరు శక్తివంతమైన Google AdSense ఆదాయాన్ని కొనసాగించాలనుకుంటే, ఎల్లప్పుడూ మీ కంటెంట్ మరియు మీ సైట్ను ప్రచారం చేయడం కొనసాగించాలి. ఎల్లప్పుడూ. అదే విధంగా, Google వెబ్మాస్టర్ మార్గదర్శకాలు ఫాలో కావడం ద్వారా మీ సైట్ను ప్రచారం చేసే సందర్భంలో మీరు Google AdSense విధానాలు ఉల్లంఘించడం లేదని కూడా తప్పకుండా నిర్ధారించుకోండి.
దానితో పాటుగా, మీ కంటెంట్ మరియు మీ సైట్ను సహజ మార్గాలలో ప్రచారం చేయగల అవకాశాలను మీరు ఎల్లప్పుడూ వెతకాలి. మీరు సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండేట్లయితే, మీ సోషల్ మీడియా ప్రొఫైల్లలో మీ సైట్కు తిరిగి పంపగల లింక్లను కలిగి ఉండాలి. మీరు ఇతరులతో సన్నిహితంగా ఉన్నప్పుడు మరియు నాణ్యమైన సంబంధాలను పెంచుకున్నప్పుడు, ప్రజలు మీతో కనెక్ట్ అయ్యే అవకాశం మెండుగా ఉంటుంది, దీని వలన మీ సైట్పై క్లిక్ చేయడం ద్వారా మీ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటారు.
మీరు మీ సైట్లోని అంశానికి సంబంధితంగా ఉండే సోషల్ మీడియా గుంపులు మరియు ఫోరమ్లలో కూడా చేరి, ఆ గుంపులు, ఫోరమ్ల యొక్క మెంబర్లకు మీ సైట్ను సన్నిహితం చేయవచ్చు. ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం అందించే క్రమంలో, అందుకు సంబంధిత వనరు లాగా మీ సైట్ కనిపించవచ్చు, లేదా మీరు మాట్లాడే ప్రజలు మీ గురించి మరింత తెలుసుకోవడానికి మీ ప్రొఫైల్ను చూసి, మీ సైట్కు తీసుకెళ్లే లింక్పై క్లిక్ చేస్తారు.
అలాగే, మీ సైట్లోని అంశం గురించి రాసే బ్లాగర్లు ఉండే నెట్వర్క్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చండి. బ్లాగ్ కామెంట్లు, సోషల్ నెట్వర్కింగ్ ద్వారా మీరు వారితో నాణ్యమైన సంబంధాలను పెంచుకుంటే, వారు మీ సైట్ను వారి బ్లాగ్ పోస్ట్లలో పేర్కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.