వనరు
మీ AdSense ఆదాయాలను మరింత పెంచుకోవడానికి మీ సైట్‌ను ఎలా ఉత్తమ ఆకారంలోకి తీర్చిదిద్దాలి
మీ AdSense ఆదాయాలు మరింత పెంచుకోవాలనుకుంటున్నారా? AdSenseతో డబ్బు సంపాదించడం కోసం మీ సైట్‌ను ఉత్తమ ఆకారంలో పొందడానికి ఈ 4 చిట్కాలను చూడండి.
Google AdSense ద్వారా డబ్బు సంపాదించేందుకు సైట్ ప్రారంభించే ఆలోచనలో లేదా మీ Google AdSense ఆదాయాలను ఎలా పెంచుకోవాలా అనే విచిత్ర పరిస్థితిలో ఉన్నారా? అలా అయితే, AdSense నుండి అత్యధిక ప్రయోజనాలను పొందేట్లు, మీ ఆదాయాలను గరిష్ఠ స్థాయికి పెంచుకునేట్లు మీ సైట్‌ను ఎలా ఉత్తమంగా మార్చుకోవాలనే తీరుపై ఇక్కడ కొన్ని చిట్కాలను అందిస్తున్నాము.
1. విశిష్ఠమైన, విలువైన కంటెంట్‌ను రూపొందించండి.
ఔత్సాహికులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో, మీ సైట్‌ను Google AdSense ప్రాథమికంగా ఆమోదించవచ్చు, కానీ నాణ్యత హామీ కోసం తర్వాత సమీక్షించబడుతుంది. మరోలా చెప్పాలంటే, 100 పేజీలను సూచిక చేసి, మానిటైజ్ చేయడానికి మీ సైట్‌ను తక్కువ నాణ్యత ఉండే కంటెంట్‌తో నింపడం కుదరదు.
దానికి బదులుగా, మీకు ఉత్సాహం గల ఏదైనా అంశం కనుగొని, అదే అంశం పట్ల ఉత్సాహం ఉన్న ఇతర వ్యక్తులను కనుగొనండి. ఆపై, వారితో కలిసి పని చేయడం ద్వారా ఆ అంశం పట్ల ఉత్సాహం కనబరుస్తున్న ఇతర వ్యక్తులు చదవాలని కోరుకునే లాంటి కంటెంట్‌ను రూపొందించండి.
2. ఇతరులను ఆకట్టుకునే విధంగా మీ సైట్‌ను తీర్చిదిద్దండి.
మీ వెబ్‌సైట్‌కు వచ్చే సందర్శకులు వెనువెంటనే మీ AdSense ప్రకటనలపై క్లిక్ చేయకపోవచ్చు. ఒకవేళ వాళ్లు కేవలం ఒక పేజీని చూడటంతోనే సందర్శనను ముగిస్తే, వారిని, వారి నుండి రాగలిగే AdSense ఆదాయాలను దాదాపు మీరు శాశ్వతంగా కోల్పోయినట్లే. అందుకనే వీక్షకులను ఆకట్టుకునేలా మీరు సైట్‌ను తీర్చిదిద్దాల్సి ఉంటుంది.
అంటే, మీ సైట్‌కు వచ్చే ప్రతి సందర్శకుడు సైట్ లోలోపలికి వెళ్లాలనిపించేలా దానిలోని కంటెంట్‌ను ఆసక్తికరంగా మలచాలి. దీని కోసం అనేక మార్గాలు ఉన్నాయి. ఔత్సాహికుల కోసం, మీ సైట్ పైభాగంలో స్పష్టమైన నావిగేషన్ ఉండాలి, దీని వలన సందర్శకులు ఉత్తమ భాగాలను కనుగొనగలరు.
తర్వాత, కంటెంట్‌లోని ప్రతి భాగం కంటెంట్‌లోని మరన్ని భాగాలకు లింక్ అయ్యేలా చూసుకోండి. దీని వలన, మీ సందర్శకుడు వారు ప్రవేశించిన పేజీని ఇష్టపడకపోతే, దానికి బదులుగా వారికి ఆసక్తి ఉండగల మరొక అంశం లింక్‌ను చూసే అవకాశం ఉంటుంది.
ఏదేమైనప్పటికీ, సైడ్‌బార్‌లో మరిన్ని కంటెంట్ లింక్‌లు ఉండేలా చూసుకోండి. మీ కంటెంట్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన, అత్యధికంగా షేర్ అయిన, అత్యధికంగా కామెంట్‌లు చేయబడిన వాటి గురించి మీ సందర్శకులకు తెలిసేలా చేయండి. కంటెంట్‌లోని ఆ నిర్దిష్ట అంశాలు ఎందుకంత ప్రసిద్ధి చెంది ఉంటాయా అని సందర్శకులు వాటి పట్ల ప్రత్యేక ఉత్సాహం కనబరుస్తారు, దీని వలన వారు మీ సైట్‌లో ఎక్కువ సేపు గడిపే అవకాశం ఉంటుంది. మీ పేజీలు ఎక్కువ సార్లు లోడ్ అయ్యే కొద్దీ, వారు మరిన్ని ఎక్కువ ప్రకటనలు చూస్తారు. దీని ఫలితంగా మరింత ఎక్కువ Google AdSense ఆదాయాలు లభించే అవకాశం ఉంటుంది.
3. మీ సందర్శకులు మీ సైట్‌కు మరలా రావడానికి మరిన్ని ఎక్కువ మార్గాలను అందించండి.
మీ సందర్శకులు మీ సైట్‌ను మర్చిపోయేలా చేయకండి. సందర్శకులు మీతో కనెక్ట్ అవ్వడానికి గల అనేక మార్గాలను మీ హెడర్, సైడ్‌బార్, కంటెంట్ ముగింపు, ఫుటర్ ప్రదేశాలలో చేర్చడం అత్యుత్తమ పద్ధతి, అప్పుడు వారు మిమ్మల్ని ఫాలో అవ్వగలుగుతారు. మీరు ఇమెయిల్‌తో ప్రారంభించడాలు, సోషల్ నెట్‌వర్క్‌లు లాంటి ఎంపికలను చేర్చాలి. ఈ విధంగా, మీరు ఒక కంటెంట్ భాగాన్ని ఉత్పాదించే లేదా ప్రచారం చేసే ప్రతి సారి, మీ సైట్ గురించి మీరు మీ సందర్శకునికి గుర్తు చేయవచ్చు, దీని వలన వారు మరలా మీ AdSense ప్రకటనలు మరిన్నింటిపై క్లిక్ చేయడానికి అవకాశం ఉంటుంది.
4. మీ వినియోగదారు అనుభవాన్ని ఆప్టిమైజ్ చేయండి.
చాలా మంది సైట్ యజమానులను వేధించే ఏకైక అంశం వినియోగదారు అనుభవం. మీ వద్ద గొప్ప కంటెంట్, ఉత్తమ స్థానంలో ప్రకటన ఉన్నప్పటికీ మొబైల్ పరికరాలలో మీ సైట్ లోడ్ కాకపోతే లేదా నెమ్మదిగా లోడ్ అయ్యేట్లయితే, మీ సందర్శకులు మీ కంటెంట్‌ను వినియోగించే లేదా మీ ప్రకటనలపై క్లిక్ చేసే అవకాశం పొందడానికి ముందే వారిని చేజార్చుకునే ప్రమాదం ఉంటుంది.
అందుకే, మీ సైట్ కోసం మీరు కొన్ని పనులు చేయడం అవసరం. ముందుగా, ' Googleతో నా సైట్‌ను పరీక్షించు 'ఫీచర్‌ను ఉపయోగించి కొన్ని పరీక్షలు నిర్వహించడం ద్వారా మొబైల్ యూజర్‌లకు మీ సైట్ సక్రమంగా పని చేస్తోందని, త్వరగా లోడ్ అవుతోందని నిర్ధారించుకోండి. మీ సైట్‌లో ఏవైనా సమస్యలు ఉంటే, ఈ రెండు సాధనాలు వాటిని మీకు మళ్లిస్తాయి, కాబట్టి మీరు వాటిని పరిష్కరించవచ్చు.
తర్వాత, మీరు ఇప్పటికే సైన్ అప్ చేసి ఉండకుంటే Google Analytics మరియు Google Search Console కోసం సైన్ అప్ చేయండి. Google Analytics సహకారంతో మీకు వచ్చే సందర్శకుల ట్రాఫిక్ స్థాయిలను గమనించగలుగుతారు. దీని వలన ఏదైన తగ్గుదలను గుర్తిస్తే, మీరు ఆ విషయంపై వెనువెంటనే దృష్టి సారించవచ్చు. Google Search Consoleలో వివిధ రకాల సాధనాలు అందించబడతాయి. మీ వెబ్‌సైట్‌లో ఏవైనా పనితీరు సమస్యలున్నా లేదా మీ సందర్శకులకు సమస్యలు కలిగించే ఇతర ఎర్రర్‌లు ఏర్పడినా కనుగొనడంలో ఈ సాధనాలు సహాయపడతాయి.