వనరు

3 దశలలో అద్భుతమైన వెబ్‌సైట్ కంటెంట్‌ను రూపొందించడం

రిసోర్స్ ఇమేజ్
ఉత్తమ అభ్యాసాలు

కంటెంట్ మార్కెటింగ్ మీ వెబ్‌సైట్‌కు కొత్త సందర్శకులను తీసుకురావడమే కాకుండా, వారు నిరంతరం వచ్చేలా కూడా ఆకర్షిస్తుంది. కనుక, ఈ విషయంలో సహాయపడగల ఈ టూల్స్ ద్వారా ప్రయోజనం పొందండి.

గొప్ప కంటెంట్ మార్కెటింగ్ విధానం కేవలం కొత్త సందర్శకులను మీ సైట్‌కు తీసుకురావడమే కాకుండా, మునుపటి సందర్శకులు కూడా తిరిగి వచ్చేలా ఆకర్షిస్తుంది. కంటెంట్ వ్యూహరచన కీలకం, కనుక ఈ విషయంలో సహాయపడగల ఈ టూల్స్ ద్వారా ప్రయోజనం పొందండి.

1. అధిక అవకాశమున్న అంశాలను గుర్తించండి

మీరు ఏదైనా వెబ్‌సైట్ కంటెంట్‌ను రూపొందించడం ప్రారంభించే ముందు, మీరు చేరువ కావాలని లక్ష్యం చేసుకుంటున్న యూజర్‌ల ఆసక్తులు, కంటెంట్ వినియోగ ప్రవర్తనను అర్థం చేసుకోండి. అధిక అవకాశాలు అందించే అంశాలను కనుగొనండి. ఉదాహరణకు, సముచితమైన కంటెంట్ ఆలోచనలు – అంటే, ప్రజలలో అమితాసక్తి ఉన్నా లేదా అనేక క్వెరీలు ఉన్నా, వాటికి మ్యాచ్ అయ్యే సైట్‌లు మాత్రం అతికొద్దిగానే ఉండే అంశాలు – వీటిని చూడటానికి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది, కాబట్టి మీ కంటెంట్ ప్రత్యేకంగా కనిపించేలా చేయగలవు. 

  • Google Trends అన్నది ప్రపంచమంతా వేటి కోసం వెతుకుతున్నది చూపుతుంది. Google Searchలో వివిధ ప్రాంతాలు, భాషలలో అధికంగా వెతుకుతున్న ప్రధాన సెర్చ్ క్వెరీలను ఇది విశ్లేషిస్తుంది, నిర్ణీత కాలంలో ఏదైనా ఒక క్వెరీని ఎన్నిసార్లు వెతికినది పోల్చడానికి గ్రాఫ్‌లను అందిస్తుంది. ట్రెండింగ్‌లో ఉన్న సెర్చ్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోండి లేదా ఏదైనా సెర్చ్ పదాన్ని ఎంటర్ చేయడం ద్వారా సంబంధిత అంశాలు, క్వెరీలను కనుగొనండి. ఈ టెక్నిక్‌ల సహాయంతో యూజర్‌లు వేటి పట్ల ఆసక్తి కనబరుస్తున్నది గ్రహించవచ్చు, తద్వారా మీరు మీ కంటెంట్‌ను తగినట్లుగా రూపొందించవచ్చు.

నిపుణుల చిట్కా

  • Google ప్రశ్నల హబ్ సమాధానాలు పొందలేకపోయిన ప్రశ్నలను నేరుగా యూజర్‌ల నుండి సేకరించడం ద్వారా ఆన్‌లైన్‌లో అసమగ్రంగా ఉండే కంటెంట్‌ను గుర్తిస్తుంది. ఈ గణాంకాలు ఉపయోగించడం ద్వారా మీ ప్రేక్షకుల కోసం మెరుగైన కంటెంట్‌ను రూపొందించండి.
  • మార్కెట్ ఫైండర్ మీ బిజినెస్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తృతపరచడానికి కొత్త అవకాశాలకు దారులు తెరుస్తుంది. ఇది నెలవారీ సెర్చ్‌లు, ప్రసిద్ధ మార్కెట్ ట్రెండ్‌లు, తలసరి నికర ఆదాయం, ఇంటర్నెట్ యూజర్‌ల సంఖ్యను దేశం వారీగా విశ్లేషించడం ద్వారా మీ ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లు, కంటెంట్‌కు ఎక్కడ అమితాదరణ లభిస్తుందో ప్రాధాన్యపరచడంలో మీకు సహాయపడుతుంది. మీ బ్రాండ్‌కు లాభదాయకంగా ఉండే అవకాశమున్న కొత్త మార్కెట్‌లను ఒక షార్ట్‌లిస్ట్ రూపంలో తయారు చేసుకుని, వాటిని టార్గెట్ చేయడం ద్వారా మీ సైట్ కంటెంట్‌ను విస్తృతపరిచి అంతర్జాతీయ యూజర్‌ల వద్దకు తీసుకువెళ్లండి. 
  • న్యూస్ కన్జ్యూమర్ గణాంకాలు అన్నవి అత్యంత అర్హులైన యూజర్‌లను అందిస్తున్న ట్రాఫిక్ సోర్స్‌లు, మీ సందర్శకులతో మరింత మెరుగ్గా ఎంగేజ్ అవ్వగలిగే మార్గాల గురించి విశ్లేషణను అందిస్తాయి. ఉదాహరణకు, NCIలో ఒక్కో యూజర్ సందర్శనల సంఖ్య అధికంగా, కానీ ఒక్కో సందర్శనకు పేజీల సంఖ్య తక్కువగా చూపబడితే, మీ అంతర్గత రీసర్క్యులేషన్‌ను మరింత మెరుగుపరుచుకోవాలి అని చెప్పడానికి అది సంకేతం. మీ కంటెంట్‌లో అమితంగా జనాదరణ పొందిన అంశాలకు తీసుకెళ్లే లింక్‌లను కథనాల దిగువ భాగంలో అందించి, వాటిని క్లిక్ చేసే విధంగా పాఠకులను ఆహ్వానించండి. 

మర్చిపోవద్దు

కంటెంట్ అంతా కూడా తప్పకుండా వెబ్‌మాస్టర్ నాణ్యతా మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి.

2. మీ కంటెంట్ మార్కెటింగ్‌ను మెరుగుపరుచుకోండి

మీ ప్రేక్షకుల గురించి, మీ సైట్‌తో వారు ఎంగేజ్ అవుతున్న మార్గాల గురించి తెలుసుకోండి, అప్పుడే మీరు సత్ఫలితాలు ఇస్తున్న వాటిని, నిరుపయోగమైన వాటిని గమనించి, ఆ ప్రకారం మీ కంటెంట్ వ్యూహ రచనను మెరుగుపరుచుకోవచ్చు. Google Analytics లో కలిగి ఉండే టూల్స్ మీ యూజర్‌ల గురించి మరింత సమగ్ర అవగాహన కలిగించడంతో పాటు, మీరు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్న అంశాలను గుర్తిస్తాయి.

  • ప్రవర్తన రిపోర్ట్‌లు మీ సైట్‌లోని మొత్తం పేజీలు, వాటిలో కంటెంట్‌కు గల ఆదరణ గురించి తెలియజేస్తాయి.
  • మీరు Search Console ని Google Analyticsతో లింక్ చేసినప్పుడు, ఏయే క్వెరీలు యూజర్‌లను మీ సైట్‌కు తీసుకువచ్చినది మీరు చూడగలరు, సమస్యలు పరిష్కరించగలరు, మీ సైట్ ఇంప్రెషన్‌లు, క్లిక్‌లు, Google Searchలో స్థానాన్ని విశ్లేషించగలరు. 
  • Realtime కంటెంట్ గణాంకాలు అన్నవి మీ పాఠకుల నుండి అత్యంత ప్రజాదరణ పొందుతున్న కథనాలు వాటితో పాటుగా మీ ప్రాంతంలో ట్రెండింగ్ అవుతున్న విస్తృత అంశాలను గుర్తించడంలో మీకు సహాయపడతాయి.
రిసోర్స్ పొందుపరిచిన ఇమేజ్

3. తాజా చిట్కాలు, ట్రెండ్‌ల గురించి తెలుసుకోండి

ప్రజల వెబ్ వినియోగం ఎంత అభివృద్ది చెందుతున్నది, ఇతర బిజినెస్ సంస్థలు ఎలా స్పందిస్తున్నది తెలుసుకోవడంతో పాటు విస్తృత అవగాహన పొందేలా దృష్టి సారించడం మర్చిపోకండి.

  • కన్జ్యూమర్ బారోమీటర్ అన్నది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వెబ్‌ను ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగిస్తున్నది చూపుతుంది. ఇది ఆన్‌లైన్ పరిశోధన కోసం, అదే విధంగా వనరుల కోసం అభివృద్ధి చెందుతున్న స్టోర్‌హౌస్. ఇది కన్జ్యూమర్ పరికర ప్రాధాన్యతలలో దేశ నిర్దిష్టమైన డేటా మొదలుకుని ప్రజలు తమ కొనుగోలు నిర్ణయాలు తీసుకునే గణాంకాల దాకా అన్నింటినీ అందిస్తుంది.
  • విజయగాథలు సమాజంలో భిన్న వర్గాల నుండి ప్రేరణను, స్ఫూర్తిని అందిస్తాయి. ఇతర వ్యక్తులు తమ ప్యాషన్‌లు సాధించడం కోసం నిధులు సమకూర్చుకోవడానికి AdSenseని ఎలా ఉపయోగిస్తున్నది చూపుతాయి.