వనరు
వెబ్‌సైట్‌ను ఎలా క్రియేట్ చేయాలి
మీ అభిరుచిని షేర్ చేసుకోవడం కావచ్చు, కమ్యూనిటీని క్రియేట్ చేయడం కావచ్చు, లేదా మీ బిజినెస్‌ని ప్రమోట్ చేయడం అయినా కావచ్చు; మీకంటూ ఓ వెబ్‌సైట్ అవసరమవ్వడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.
ఇది చూడటానికి ఎలా ఉంటుంది అనే దాని గురించి, మీరు చూపాలనుకుంటున్న ఫీచర్‌ల గురించి, కంటెంట్ రకాల గురించి మీరు ఇప్పటికే ఆలోచిస్తూ ఉండవచ్చు.
కానీ మీరు దీనిలోకి దిగే ముందు, ఎక్కడి నుండి మొదలుపెట్టాలి, మీ ఊహకు ఓ రూపాన్నివ్వడానికి ఏం అవసరం అవుతుంది అన్న అంశాల గురించి ఇందులో ఉన్న కొన్ని ప్రధాన దశలను చూద్దాం.
మీ లక్ష్యాన్ని సెట్ చేయడంతో ప్రారంభించండి
మీ వెబ్‌సైట్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? అది ప్రధానంగా బ్లాగింగ్ అయితే, అది మీకు కావలసిన లేఅవుట్‌ను రకాన్ని, నావిగేషన్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. లేదా మీరు ప్రోడక్ట్‌లను, లేదా సర్వీస్‌లను విక్రయించడానికి దీన్ని ఉపయోగించాలని ప్లాన్ చేస్తుంటే, మీకు సురక్షితమైనది, నావిగేట్ చేయడానికి సులభంగా ఉండేది, కొత్త ఇన్వెంటరీతో సులువుగా అప్‌డేట్ చేయగలిగేది ఏదైనా అవసరం అవుతుంది.
జాగ్రత్తగా బడ్జెటింగ్ చేయండి
వెబ్‌సైట్‌ను నిర్మించడానికి ధరలు సున్నా నుండి వేల వరకు ఉంటాయి. ఇది నిజంగా మీకు కావలసిన సైట్ రకం పైనా, దానితో మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు అనే దాని పైనా ఆధారపడి ఉంటుంది.
మీకు సాధారణ బ్లాగింగ్ సైట్ అవసరమైతే, ఎంచుకోవడానికి అనేక ఉచిత టూల్స్, ఆప్షన్‌లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఉపయోగించడానికి సులువుగా ఉండి, చూడగానే అర్థమయ్యేలా ఉంటాయి. కాబట్టి మీకు డిజైన్ లేదా కోడింగ్ అనుభవం ఉండాల్సిన అవసరం ఉండదు. అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే, చూస్తుండగానే మీరు తలపెట్టిన పనిలో ముందుకు దూసుకెళ్తారు, పైగా మీ స్వంత వెబ్‌సైట్ డిజైనర్ కోసం లేదా డెవలపర్ కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండానే పని జరిగిపోతుంది.
సరైన వెబ్‌సైట్ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోండి
చాలా మందికి ఓనామాల నుండి మొదలుపెట్టి తమదైన స్వంత వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసుకోవడానికి కావలసినంత సమయం లేదా నైపుణ్యం ఉండదు - అలాంటప్పుడే వెబ్‌సైట్ బిల్డర్లు రంగంలోకి ప్రవేశిస్తారు. మీ కోసం కోడింగ్ మొత్తం పూర్తి చేసి ఉంటుంది, కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒక టెంప్లేట్‌ను ఎంచుకోవడం, ఆపై మీ స్వంత టెక్స్ట్‌ను, ఇమేజ్‌లను చేర్చి ఫినిషింగ్ టచ్‌లతో దానిని అనుకూలీకరించుకోవడం మాత్రమే.
వెబ్‌సైట్ బిల్డర్‌ను ఉపయోగించడంలో కష్టంగా అనిపించడానికి అవకాశం ఉన్న అంశం ఏమిటంటే, దేనిని ఎంచుకోవాలి అన్నది నిర్ణయించుకోవడం. ప్రొవైడర్ల విషయానికొస్తే వందల మంది అందుబాటులో ఉన్నారు; ఒక్కసారిగా చూసినప్పుడు వారందరూ ఒకే విధమైన లేదా చూడటానికి ఒకేలా ఉండే సర్వీస్‌లను అందిస్తున్నట్లు అనిపిస్తుంది.
ప్రొవైడర్‌ను ఎంచుకునే ముందు, ముందుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి:
- దీనికి సురక్షితమైన URL ఉందా లేదా తర్వాత జోడించే ఆప్షన్ ఉందా?
- ఇది ఉపయోగించడానికి అనువుగా అనిపించేలా ఉందా?
- మీరు దీన్ని మీ అవసరాలకు తగినట్లుగా మలుచుకోగలరా?
- దీనికి ఎంత ఖర్చు అవుతుంది? అది మొత్తం ఒకసారికే చేసే పేమెంటా లేదా నెలవారీ ఫీజా?
- ఎంచుకోవడానికి చాలా టెంప్లేట్‌లు ఉన్నాయా?
- వారు సాంకేతిక సపోర్ట్‌ను అందిస్తారా? ఇది ఉచితమా? ఇది ఈమెయిల్, ఫోన్ లేదా చాట్‌బాట్ ద్వారానా?
- వారు వీడియో లేదా న్యూస్ లెటర్ సైన్ అప్‌లను క్యాప్చర్ చేయడం వంటి ప్లగ్ఇన్‌లను లేదా ఎక్స్‌టెన్షన్‌లను అందిస్తారా?
గట్టిగా చెప్పాలంటే, మీరు మీ సైట్‌ను దేనికి ఉపయోగించాలనుకుంటున్నారనే దానిపైనే చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి. Google Blogger వంటి టూల్స్ సహాయకరంగా ఉండగలవు, విభిన్న టెంప్లేట్‌లు డిజైన్ స్టయిల్స్ నుండి ఎంచుకోవడానికి మీకు వీలు కల్పించగలుగుతాయి. Google Sites అనేది కూడా ఉంది; ఇది చిన్న బిజినెస్‌ను, ఈవెంట్‌ను ప్రమోట్ చేయడానికి లేదా వర్క్ పోర్ట్‌ఫోలియోను షోకేస్ చేయడానికి గొప్ప మార్గం కాగలదు. ఈ క్విక్ గైడ్ మరింత సమాచారాన్ని కలిగి ఉంది. అవసరమైన సమాచారాన్ని విశ్లేషించుకుని నిర్ణయం తీసుకోవడంలో ఇది మీకు సహాయం చేస్తుంది.
మీ డొమైన్ పేరును సెటప్ చేయండి
మీ స్వంత డొమైన్ పేరుపై డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, ఉచిత వెబ్ బిల్డర్ టూల్స్‌లో చాలా వరకు సాధారణ బ్లాగ్‌ను క్రియేట్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తాయి. మీరు బ్లాగింగ్ గురించి పట్టుదలగా ఉన్నట్లయితే, లేదా మీ వెబ్‌సైట్ బిజినెస్ కోసం ఉద్దేశించినది అయితే; మీరు అందించేది మరింత అనుకూలీకరించినది, విశిష్టమైనదిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.
మీరు ఏ అగ్ర-స్థాయి డొమైన్ (TLD) కోసం వెళ్లాలనే దాని గురించి కూడా ఆలోచించాలి. ఉదాహరణకు, మీ వెబ్‌సైట్ నిర్దిష్ట ప్రాంతం లేదా దేశంలో కేంద్రీకరించబడి ఉంటే, మీరు .uk, .fr, .de, మొదలైన వాటిని ఎంచుకోవచ్చు. లేదా అది మరింత గ్లోబల్ అయితే, మీరు .com అడ్రస్‌ను ఎంచుకోవచ్చు.
TLDని ఎంచుకునేటప్పుడు పరిగణించవలసిన ఇతర విషయాలు:
- పెరుగుతున్న ఖర్చుల పట్ల జాగ్రత్త వహించండి. కొంతమంది ప్రొవైడర్లు ప్రారంభించడం కోసం మొదట డిస్కౌంట్ ధరలను ఆఫర్ చేస్తారు, ఆ తర్వాత వాటిని పెంచుతారు.
- మీ డొమైన్ పేరు ఇప్పటికే వ్యాపారచిహ్నంగా చేయబడి ఉన్నది కాదని నిర్ధారించుకోండి. మీరు ఎంచుకున్న పేరు మరొక బ్రాండ్ కాపీరైట్‌ను అతిక్రమిస్తే, ఆ పేరును మీరు తప్పకుండా మార్చాల్సి రావొచ్చు, అలాగే చట్టపరమైన ఫీజు కూడా పే చేయాల్సి రావచ్చు. దాని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.
- మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచండి. డొమైన్ కోసం సైన్ అప్ చేసినప్పుడు, మీరు మీ వివరాలను ICANNకి అందించాలి - స్పామర్‌లు, స్కామర్‌లు దీనిని సులభంగా యాక్సెస్ చేయగలరు. మీరు మీ వివరాలను ప్రైవేట్‌గా ఉంచడాన్ని ఎంచుకోవచ్చు, కొంతమంది రిజిస్ట్రార్లు ఈ సర్వీస్ కోసం ఛార్జీ చేస్తారు, కాబట్టి ముందుగా చెక్ చేయడం మరవకండి.
మీ డొమైన్ పేరును ఎంచుకొనేటప్పుడు, ప్రారంభించడానికి Google Domains మంచి ప్రదేశం కాగలదు. ఇది అందుబాటులో ఉన్న వాటిని, వాటి ధరలను త్వరితంగా చూపుతుంది, అంతే కాకుండా ఏవైనా ప్రయోజనాలు, లోటుపాట్లు ఉండే అవకాశాలను కూడా సూచిస్తుంది - ఉదాహరణకు, పలకడం కష్టంగా ఉన్నా లేదా తప్పుగా వినే అవకాశం ఉన్నా తెలియజేస్తుంది.
మీ కంటెంట్‌ని క్రియేట్ చేయడం
మీరు మీ ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకున్నారు, మీరు మీ డిజైన్‌ను ప్లాన్ చేశారు, ఇప్పుడు ఉత్సాహాన్నిచ్చే భాగానికి సమయం ఆసన్నమైంది: మీ ప్రేక్షకులు ఇష్టపడే కంటెంట్‌ను రూపొందించడం. గమనించాల్సిన అంశం ఏమిటంటే, కొన్ని ప్రాథమిక సూత్రాలను అనుసరించడం ద్వారా మీ సమయం, డబ్బు ఆదా అవుతాయి; మీ సందర్శకులను మరిన్నింటి కోసం తిరిగి మీ సైట్‌కు వచ్చేలా ఇది ప్రోత్సహిస్తుంది.
ఈ ముఖ్యమైన చిట్కాలను ట్రై చేయండి.
- Google Trends అనేది వ్యక్తులు దేని కోసం వెతుకుతున్నారో, నిర్దిష్ట పదాలు లేదా పదబంధాల పట్ల ప్రజాదరణ కాలక్రమేణా ఎలా మారుతుందో చూడటానికి ఉపయోగకరమైన మార్గం. మీరు వివిధ ప్రాంతాల నుండి మీ కంటెంట్‌పై ఆసక్తిని కూడా అంచనా వేయవచ్చు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులుగా మారే అవకాశం ఉన్న వారిని గుర్తించవచ్చు. పోల్స్‌ను నిర్వహించడానికి, ట్రెండింగ్‌లో ఉన్న వాటిని, లేదా కొత్తగా పుట్టుకొస్తున్న వాటిని కనుగొనడానికి మీరు ఎల్లప్పుడూ మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు లేదా ఇతర ఆన్‌లైన్ కమ్యూనిటీ గ్రూప్‌లను ఉపయోగించవచ్చన్న విషయాన్ని మర్చిపోకండి.
- మీరు కంటెంట్‌ను జెనరేట్ చేయడాన్ని ప్రారంభించడానికి ముందే, మీరు ఎంత తరచుగా పబ్లిష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారో నిర్ణయించుకోండి - అలాగే దానికి కట్టుబడి ఉండండి. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే, క్వాంటిటీ పైన క్వాలీటిదే గెలుపు.
- ఒక్క విషయం దృష్టిలో పెట్టుకోండి, కంటెంట్‌ను వినియోగించడాన్ని ప్రతి ఒక్కరూ ఒకే రీతిలో ఇష్టపడరు. కొందరు సాదా టెక్స్ట్ ఇష్టపడతారు, మరికొందరు ఇన్ఫోగ్రాఫిక్స్ వేగాన్ని లేదా వీడియో సౌలభ్యాన్ని అభినందిస్తారు. కాలక్రమేణా, ఏది ఉత్తమంగా పని చేస్తుందో మీరు తెలుసుకుంటారు.
- మీరు కంటెంట్‌ను పబ్లిష్ చేయడం ప్రారంభించిన తర్వాత, మీ సందర్శకులు ఎక్కడి నుండి వస్తున్నారు, వారు మిమ్మల్ని ఎలా కనుగొంటున్నారు, ఏ పేజీలు అత్యంత ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి అనే విషయాలను మీరు తెలుసుకోవాలని అనుకుంటారు. అలా చేయడానికి ఒక మార్గం Google Analyticsను ఉపయోగించడం. రియల్-టైమ్ ఫలితాల కోసం దీనిని మీరు నేరుగా మీ బ్లాగ్‌కు కూడా లింక్ చేయవచ్చు.
- ఈ గైడ్ మీ సందర్శకుల కోసం కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి సంబంధించి మరిన్ని టూల్స్‌ను, చిట్కాలను అందిస్తుంది, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్ఫూర్తిదాయకమైన విజయగాథలను తెలియజేస్తుంది.
మీకంటూ స్వంత వెబ్‌సైట్‌ను కలిగి ఉండటం అన్నది మీ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి, మీ వ్యక్తిగత లేదా వాణిజ్యపరమైన లక్ష్యాలను సాధించడానికి ఒక ఉత్సాహకరమైన, ప్రయోజనకరమైన మార్గం. ఈ గైడ్‌లోని టూల్స్‌ను, చిట్కాలను ఉపయోగించడం వలన ప్రారంభించడానికి, అలాగే ఖరీదైన తప్పులను నివారించడానికి మీకు సహాయం లభిస్తుంది. మీ ఆన్‌లైన్ సమాచారాన్ని మానిటైజ్ చేయడానికి, మీ యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మార్గాలను అన్వేషించేందుకు మీరు మా రిసోర్స్ కేంద్రాన్ని కూడా ఉపయోగించవచ్చు.