వనరు
మీ వెబ్‌సైట్ యూజర్ అనుభవం (UX) వ్యూహాన్ని ఎలా మరింత మెరుగుపరచాలి
సరళంగా సాగే వెబ్‌సైట్ యూజర్ అనుభవాన్ని (UX) రూపొందించడం కీలకం. వెబ్‌సైట్ అనుభవంపై ప్రతికూల ప్రభావం చూపించే దేనినైనా సరిదిద్దడానికి UX వ్యూహం మీకు సహాయపడుతుంది.
దీనికి సంబంధించి అనేక సైట్‌లు అందుబాటులో ఉన్నాయి. గొప్ప కంటెంట్‌ను రూపొందించడమే కాకుండా, మీది ప్రత్యేకంగా కనిపించేలా చూడటం కూడా అత్యంత కీలకం. ఎలా? అద్వితీయమైన యూజర్ అనుభవాన్ని (UX) అందించడం దీనికి ఉన్న ఒక మార్గం.
టూల్స్ ఉపయోగించడం ద్వారా మీరు మీ యూజర్‌ల దృష్టి కోణంలో ఆలోచిస్తూ, మీ సైట్‌లో సులభంగా యాక్సెస్ చేయనివ్వకుండా వారి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్న వాటిని సరిదిద్దండి. దీని వలన, ఈ ఆప్టిమైజేషన్‌లు మీ యాడ్‌ల పనితీరుపై సానుకూల ప్రభావం చూపించగలవు.
మీ సైట్ పనితీరు ఎలా ఉన్నది కొలవండి
మొదటి దశగా, ప్రస్తుతం మీ వెబ్‌సైట్ అందించే యూజర్ అనుభవాన్ని బేరీజు వేసి, ఎలాంటి మార్పులు చేయాలో అర్థం చేసుకోండి.
- Search Consoleను ఉపయోగించడం ద్వారా Google Search ఫలితాలలో మీ సైట్ పనితీరును అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన కొలమానాలను ట్రాక్ చేయండి . మీ సైట్ ఎంత తరచుగా కనిపిస్తున్నది, దాని సగటు స్థానం, క్లిక్-త్రూ-రేట్‌లు మరిన్నింటిని కనుగొనండి.
- కాలానుగుణంగా మీ సెర్చ్ ట్రాఫిక్ ఎలా మారుతున్నది, ఎక్కడి నుండి వస్తున్నది, ఏయే సెర్చ్ క్వెరీలు ఎక్కువగా సైట్‌ను చూపుతున్నాయి అనే విషయాలను పనితీరు నివేదిక తెలియజేస్తుంది. Google Search నుండి ఏయే పేజీలకు అత్యధిక (అత్యల్ప) క్లిక్-త్రూ-రేట్ ఉన్నదో చూడండి.
- Lighthouse ద్వారా ఎప్పుడూ తెలియని మరిన్ని విస్తృత పనితీరు అవకాశాలు తెలుసుకోండి, అలాగే వెబ్ పేజీల నాణ్యతను మెరుగుపరుచుకోండి . Lighthouse ఆడిట్‌ల సహాయంతో, మీ సైట్ పనితీరు, యాక్సెస్ సామర్థ్యం, యూజర్ అనుభవాన్ని ప్రభావితం చేసే సాధారణ సమస్యలను మీరు గుర్తించి, వాటిని పరిష్కరించవచ్చు.
- సందర్శకుడు మొబైల్ పరికరంలో మీ పేజీని ఎంత సులభంగా ఉపయోగించవచ్చనేది చూడటానికి మొబైల్-అనుకూల టెస్ట్ రన్ చేయండి. పేజీ URLను ఎంటర్ చేయడం ద్వారా మీ స్కోర్ ఎలా ఉన్నది కనుగొనండి. మీ సైట్‌కు వచ్చే యూజర్‌లలో అధిక మంది మొబైల్ పరికరాన్ని ఉపయోగిస్తుండవచ్చు, కాబట్టి మీ సైట్‌ను మొబైల్-అనుకూలం చేసి ఉండకపోతే, మీరు తప్పకుండా ఆ విధంగా మార్చాలి.
- ఏదైనా మొబైల్ సైట్ పేజీ లోడ్ కావడానికి మూడు సెకన్ల కంటే ఎక్కువ సమయం పడితే, వాటిని సందర్శించే యూజర్‌లలో 53% మంది, ఆ సైట్‌లను వదిలి వెళ్లిపోతున్నారు. కాబట్టి మీ సైట్‌లోని పేజీలు చాలా వేగంగా ఉండటం ఎంతో ముఖ్యం. మీ మొబైల్ పేజీ వేగాన్ని తనిఖీ చేసి, దానిని పరిశ్రమలోని ప్రమాణాలుతో పోల్చి చూడండి.
అనుకూల యూజర్ అనుభవం అందించడం కోసం రూపకల్పన
ఇప్పుడు మీ సైట్‌ను ఎలా కొలిచేది తెలుసుకున్నారు, దీనికి మెరుగుదలలు చేయడానికి UX వ్యూహాలలో మీ విశ్లేషణను ఎలా వినియోగించాలనే దానిపై దృష్టి సారించండి. మీ యూజర్‌ల కోసం మరింత సరళమైన, వేగవంతమైన అనుభవాన్ని అందించడానికి మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన మూడు అభివృద్ధి సంబంధిత ఫ్రేమ్‌వర్క్‌లు ఉన్నాయి.
- AMP (అంటే, Accelerated Mobile Pages) అన్నది వెబ్ కాంపొనెంట్‌ల ఫ్రేమ్‌వర్క్, దీని సహాయంతో మీరు అన్ని పరికరాలలో ఒకే రీతిలో వేగవంతంగా రన్ అయ్యే అధిక పనితీరు గల వెబ్‌సైట్‌ను రూపొందించవచ్చు.
- ప్రతిస్పందనాత్మక వెబ్ రూపకల్పన అన్నది డెస్క్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఫోన్‌లతో సహా అన్ని పరికరాల్లో చక్కగా కనిపించేలా ఆటోమేటిక్‌గా వెబ్‌సైట్ సైజ్‌ను మార్చడానికి, కుదించడానికి లేదా పెద్దది చేయడానికి HTML, CSSలను వినియోగించడం గురించి తెలియజేస్తుంది.
- ప్రోగ్రెసివ్ వెబ్ యాప్‌లు అన్నవి ఇన్‌స్టాల్ చేసుకోదగిన, యాప్ లాంటి అనుభవాన్ని డెస్క్‌టాప్, మొబైల్ రెండింటిలో అందిస్తాయి. నేరుగా వెబ్ ద్వారా రూపొందించి, అందించే ఈ వెబ్ యాప్‌లు ఏ బ్రౌజర్‌లో అయినా వేగంగా, విశ్వసనీయంగా పని చేస్తాయి.
మొబైల్‌ను ప్రధానంగా దృష్టిలో ఉంచుకోండి
ఇప్పుడు చాలా వరకు యూజర్‌లు Google Searchను మొబైల్ పరికరంలో ఉపయోగిస్తున్నందున, మీ సైట్ కంటెంట్ యొక్క మొబైల్ వెర్షన్ అన్నది ఇండెక్స్ చేయడం ర్యాంకింగ్ గురించి తెలియజేస్తుంది. మీ సైట్‌కు ప్రత్యేక డెస్క్‌టాప్, మొబైల్ కంటెంట్ ఉంటే మొబైల్ మొదటి ప్రాధాన్యంగా ఇండెక్స్ చేయడం కోసం ఆప్టిమైజ్ చేయడానికి మీరు వీటిని గుర్తుంచుకోవాలి.
- మీ డెస్క్‌టాప్ సైట్ మాదిరిగానే మీ మొబైల్ సైట్‌లో కూడా అదే కంటెంట్ ఉండాలి.
- నిర్మాణాత్మక డేటా మీ సైట్‌లోని రెండు వెర్షన్‌లలో అందుబాటులో ఉండాలి.
- సైట్‌లోని రెండు వెర్షన్‌లలో మెటాడేటా అందుబాటులో ఉండాలి.
డిజైన్ విషయానికి వస్తే, యూజర్‌లు అసహనంగా ఉంటారని గుర్తుంచుకోవాలి – కనుక మీ సైట్‌ను క్రమబద్ధంగా నిర్వహించాలి, అప్పుడే వ్యక్తులు వారు కోరుకునేది సులభంగా కనుగొనగలరు, నిర్వర్తించగలరు. మీ హోమ్ పేజీ పైన, యూజర్‌లను వారు వెతికే కంటెంట్‌కు కనెక్ట్ చేయడం కోసం నావిగేషన్ పైన దృష్టి కేంద్రీకరించండి. యూజర్‌లకు కావలసినది వేగంగా కనుగొనడంలో సహాయపడేలా సైట్ సెర్చ్‌ను అందించండి. మీ కస్టమర్‌లు సైట్‌ను నావిగేట్ చేసే విధానాలను అర్థం చేసుకుని, యూజర్‌లు వారి సొంత నిర్ణయాలపై మారిపోయే విధంగా అనుమతించండి. సులభంగా వినియోగించగలిగే ఫారంలను చేర్చి, సరళమైన, అవాంతర రహితమైన మార్పిడి అనుభవం అందించండి.
మీ వెబ్‌సైట్ యూజర్ అనుభవాన్ని మంచి స్థితి నుండి అద్భుతమైన విధంగా మార్చుకోవడం గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ మొబైల్ రూపకల్పన బెస్ట్ ప్రాక్టీసులుచూడండి.