వనరు
మీ కంటెంట్‌ను లోకలైజ్ చేయడం ద్వారా అది కొత్త ప్రేక్షకులను చేరుకోవడానికి మీకు ఎలా సహాయం చేయగలదు
కంటెంట్ క్రియేటర్‌లు ఎక్కువ మంది ప్రేక్షకులను మరియు మరిన్ని మార్కెట్‌లను చేరుకోవడానికి, సాంస్కృతికంగా సంబంధిత వెర్షన్‌లలో అనువాదం చేసిన కంటెంట్ ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.
మానిటైజేషన్‌లో ముఖ్యమైనది మీ కంటెంట్‌ను సందర్భోచితమైనదిగా చేయడం, సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించడం అని కంటెంట్ క్రియేటర్‌గా మీరు తెలుసుకోవాలి. అలా చేయడానికి గల అత్యంత ప్రభావవంతమైన మార్గం, మీ బ్లాగ్‌ను ఇతర మార్కెట్‌లు లేదా భాషలలోకి లోకలైజ్ చేయడమే. తద్వారా అదనపు ట్రాఫిక్‌ను మళ్లించడానికి మీరు అదే కంటెంట్‌ను మళ్లీ ఉపయోగించవచ్చు. లోకలైజేషన్‌లో ఏయే అంశాలు ఉంటాయి, అది మీకు ఎలా సహాయపడగలదు, ఏ మార్కెట్‌లు, ప్రేక్షకులు మీకు తగినవారు అనే వాటిని గురించి మేము ఈ ఆర్టికల్‌లో తెలియజేస్తాము.
లోకలైజేషన్ అంటే ఏమిటి, అది ఎందుకు ముఖ్యమైనది?
లోకలైజేషన్‌లో మీ బ్లాగ్‌ను లేదా ఇతర కంటెంట్‌ను కొత్త ప్రేక్షకుల సంస్కృతికి అనుగుణంగా అనువాదం చేయడం జరుగుతుంది. సాధారణ అనువాదం లాగా కాకుండా, ఇది వ్యావహారికాలు లేదా ఇతర స్థానిక పదబంధాలను పరిగణనలోకి తీసుకుంటుంది మరియు వాటిని టార్గెట్ భాషలో అదే అర్థంతో వివరిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే, ఇంగ్లీష్ ఇప్పటికీ అత్యంత ప్రాచుర్యం పొందిన ఆన్‌లైన్ భాష అయినప్పటికీ, దీన్ని ఇప్పటికీ నలుగురిలో ఒకరు మాత్రమే ఉపయోగిస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఇంగ్లీష్‌లో మాత్రమే పబ్లిష్ చేస్తుంటే, ప్రపంచంలోని ఆన్‌లైన్ జనాభాలో 75% మందిని చేరుకోవడంలో మీరు విఫలమవుతున్నారని అర్థం.
ప్రారంభించడం
మీరు లోకలైజేషన్‌ను ప్రారంభించడానికి ముందు, ఇప్పటికే ఉన్న మీ కంటెంట్ ప్రపంచంలో ఎక్కడ గుర్తించబడుతోందో, ఆ మార్కెట్‌లు ఏ భాషలను ఉపయోగిస్తున్నాయో చెక్ చేయండి. యూజర్‌ల బ్రౌజర్ భాష ఆధారంగా వారిని సెర్చ్ చేయడం ద్వారా, మీరు దీన్ని Google Analyticsలో సులభంగా చేయవచ్చు.
లక్ష్యంగా చేసుకోవడానికి కొత్త దేశాలను కనుగొన్న తర్వాత కూడా, మీరు వేటి కోసం లోకలైజేషన్ చేయాలనుకుంటున్నారో జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఉదాహరణకు, 87% మంది ఇంగ్లీష్ మాట్లాడే హాలండ్‌లో దాని అవసరం బహుశా ఉండకపోవచ్చు కానీ, పోలాండ్‌లో, 95% మంది ప్రజలు తమ స్థానిక భాషలో ఆన్‌లైన్ కంటెంట్‌ను ఇష్టపడతారు.
మీ లోకలైజేషన్ ప్రాసెస్ సాధ్యమైనంత సజావుగా సాగడానికి ఈ ముఖ్యమైన చిట్కాలను ఉపయోగించండి.
ఆటోమేటిక్ అనువాదాలను నివారించండి
రోజువారీ ఉపయోగం కోసం ఆన్‌లైన్ అనువాదాలు ఫర్వాలేదు, కానీ అవి అందించే అనువాదాలు బహూశా స్థానిక స్పీకర్‌కు సరిగ్గా అర్థం కాకపోవచ్చు. చివరికి మీ కంటెంట్ కొద్దిగా గందరగోళంగా, అధ్వాన్నంగా, తగనిదిగా అనిపించేలా మారవచ్చు.
స్థానికులను అడగండి
మీ లోకలైజేషన్ కోసం అర్హత కలిగిన స్థానికుడిని నియమించడం వలన మీ అనువాదాలు ఖచ్చితమైనవి మాత్రమే కాకుండా, సాంస్కృతికంగా సరైనవి మరియు మీరు చేరుకోవాలని ఆశిస్తున్న వ్యక్తులకు అందుబాటులో ఉండేలా చేస్తుంది.
యూనివర్సల్ లాంగ్వేజ్ సెలక్టర్ (ULS)ను ఉపయోగించండి
ఇది మీ బ్లాగ్‌ను బ్రౌజ్ చేసేటప్పుడు యూజర్‌లకు వారి భాషా ప్రాధాన్యతలను కాన్ఫిగర్ చేయడానికి సులభమైన మరియు సౌకర్యవంతమైన మార్గాన్ని అందిస్తుంది. స్థానికంగా ఫాంట్‌లు అందుబాటులో లేని స్క్రిప్ట్‌లలో కంటెంట్‌ను చదవడానికి లేదా మీ వెబ్‌సైట్ మెనూలలో ఉపయోగించిన భాషను అనుకూలంగా మార్చడానికి కూడా ఇది వారిని అనుమతిస్తుంది.
అంతర్జాతీయ SEO బెస్ట్ ప్రాక్టీసులను ఫాలో అవ్వండి
త్వరలో మీ కంటెంట్ వివిధ భాషలు, లొకేషన్‌ల కోసం కంటెంట్‌ను ప్రదర్శించబోతోంది కాబట్టి, మీరు ఈ SEO బెస్ట్ ప్రాక్టీసులను ఫాలో అయ్యేలా నిర్ధారించుకోండి. ఉదాహరణకు, మీ సైట్ యొక్క ఏ వెర్షన్‌ను అందించాలో Googleకు తెలుసని నిర్ధారించుకోవడానికి hreflang ట్యాగ్‌లను ఉపయోగించడం.
నిదానంగా చేయండి
ప్రతి మార్కెట్ కోసం మీ కంటెంట్ మొత్తాన్ని ఒకేసారి ట్రై చేయాలని, లోకలైజ్ చేయాలని అనుకోకండి. బదులుగా, మీ ప్రేక్షకులుగా మారే అవకాశం ఉన్న ఎక్కువ మందికి, అత్యంత ప్రజాదరణ పొందిన మీ కంటెంట్‌కు ప్రాధాన్యతనివ్వండి, అక్కడి నుండి ప్రారంభించండి. AdSense ఆటోమేటిక్‌గా మీ యూజర్‌ల భాషలో యాడ్‌లను అందిస్తుంది కాబట్టి, దాన్ని ఉపయోగించడం వలన మీ భారం కొంత తగ్గవచ్చు.
తదుపరి దశలు
తక్కువ సమయం, ప్రయత్నంతో మీ కంటెంట్‌ను తిరిగి ఉపయోగించడానికి మరియు కొత్త ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి లోకలైజేషన్ ఒక అద్భుతమైన మార్గం. గుర్తుంచుకోండి, బెస్ట్ ప్రాక్టీసు గైడ్‌లైన్స్‌ను ఫాలో చేయకపోవడం, సబ్ స్టాండర్డ్ కంటెంట్‌ను క్రియేట్ చేయడం వలన త్వరలో మీ బ్రాండ్ దెబ్బతినవచ్చు, వినియోగదారులు మీకు మరొక అవకాశం ఇవ్వకపోవచ్చు.
మీకు లోకలైజేషన్ టెస్టింగ్ మరియు అమలుకు సంబంధించి సలహా కావాలంటే లేదా కొత్త ప్రాంతాలకు విస్తరించడం గురించి చిట్కాలు కావాలంటే, మార్కెట్ ఫైండర్ వెబ్‌సైట్‌ను చూడండి. మీరు ప్రారంభించడానికి అవసరమైన అన్ని గైడ్‌లు, రిసోర్స్‌లు మరియు మీ కొత్త ప్రాజెక్ట్ సజావుగా సాగడానికి కావలసిన సహాయాన్ని మీరు కనుగొంటారు.