వనరు
మీ సైట్ల యూజర్ ఎంగేజ్మెంట్ని ఎలా మెరుగుపరచాలి
మీరు బిజినెస్ ఓనర్ అయినా లేదా బ్లాగర్ అయినా, మీ వెబ్సైట్ విజయానికి కీలకం, వ్యక్తులు మరెక్కడా పొందలేని గొప్ప కంటెంట్, ప్రోడక్ట్లను లేదా సర్వీస్లను అందించడమే అని మీకు తెలుసు.
అయితే విజయానికి చేరువ చేసే కీలకమైన అంశం మరొకటి ఉంది - వ్యక్తులు మీ సైట్తో ఇంటరాక్ట్ అయ్యేలా ప్రోత్సహించడం, ఎక్కువ సేపు సైట్ను అంటిపెట్టుకొని ఉండేలా చేయడంలో మీ సైట్ ఎంత బాగా పని చేయగలిగింది అనేది ముఖ్యం.
దీన్ని ‘యూజర్ ఎంగేజ్మెంట్’ అంటారు. మీరు ట్రాఫిక్ వాల్యూమ్ ఆధారంగా యాడ్లను విక్రయిస్తుంటే గనక, ఇది చాలా ముఖ్యమైన కొలమానం అవుతుంది; ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ సమయం పాటు మీ కంటెంట్తో (ఇంకా మీ యాడ్లతో) అందరినీ ఎంగేజ్ చేసి ఉంచగలుగుతారో, అంత ఎక్కువ ఆదాయాన్ని జెనరేట్ చేయగలుగుతారు.
ఈ ఆర్టికల్లో, మీరు మీ వెబ్సైట్ యూజర్ ఎంగేజ్మెంట్ స్థాయిలను ఎలా కొలవచ్చు, వాటిని ఎలా మెరుగుపరచగలుగుతారు, ఈ క్రమంలో ఎదురయ్యే ఒడుదుడుకుల పట్ల ఎలాంటి జాగ్రత్త వహించాలి వంటి అంశాలను అన్వేషించి తెలుసుకునేలా చేస్తాము.
యూజర్ ఎంగేజ్మెంట్ ఎందుకు ముఖ్యమైనది, దానిని ఏ విధంగా కొలవాలి
రెస్టారెంట్లలో అంతగా ప్రాచుర్యం పొందని వంటకాలను తప్పిస్తూ, ఎక్కువగా అమ్ముడుపోయే వాటితో మెనూలను ఎప్పటికప్పుడు ఎలా అప్డేట్ చేస్తారో; అలాగే మీరు కూడా మీ కంటెంట్లో ఏది యూజర్లను ఎంగేజ్ చేస్తోందో, దేనిని వారు పట్టించుకోవడం లేదో, వారు విడిచిపెట్టి వెళ్లేందుకు దారి తీస్తున్న కారణాలేమిటో పర్యవేక్షిస్తూ ఉండాలి.
మీరు దీన్ని అనేక మార్గాల్లో కొలవవచ్చు:
- బౌన్స్ రేటు లింక్ని క్లిక్ చేయడం, ఏదైనా కొనడం లేదా ఫారమ్ను పూరించడం వంటి ఎలాంటి చర్యా తీసుకోకుండానే మీ సైట్ను వదిలి వెళ్ళే సందర్శకుల శాతం.
- సైట్లో గడిపే సమయం దీనిని 'సెషన్ వ్యవధి' అని కూడా పిలుస్తారు, ఇది మీ వెబ్సైట్లో ఎవరైనా వెచ్చించే మొత్తం సమయం.
- పేజీ వీక్షణలు బ్రౌజర్లో పేజీ ఎన్నిసార్లు లోడ్ చేయబడిందో లేదా వీక్షించబడిందో వివరిస్తుంది.
- కామెంట్లు లేదా షేర్లు ఇవి మీ కంటెంట్ ఎంత జనాదరణ పొందింది, ఏ మేరకు ఆసక్తికరంగా ఉంది అన్న అంశాలపై ఒక అంచనాను అందిస్తాయి.
- తిరిగి వస్తున్న సందర్శకుల శాతం ఇది నిర్దిష్ట సమయ వ్యవధిలో మీ వెబ్సైట్కు ఇప్పటికే వచ్చి, మళ్లీ అదే పరికరంలో సైట్కు తిరిగి వచ్చిన యూజర్ల సంఖ్యను వివరిస్తుంది.
మీ వెబ్సైట్ కోసం ఈ (వీటితో పాటు ఇతర) యూజర్ ఎంగేజ్మెంట్ మెట్రిక్లను కొలవడానికి, మీరు ముందుగా సైట్ ఎనలిటిక్స్ను కలిగి ఉండాలి. ఇందుకు ఒక ఆప్షన్ Google Analytics, దీనిని సెటప్ చేయడం సులభం, ఇది Google AdSenseతో సునాయాసంగా పని చేస్తుంది.
ఇక తర్వాత, యూజర్ ఎంగేజ్మెంట్ను ఎలా మెరుగుపరచాలి అనే అంశం
ఏయే ఇంటరాక్షన్లను ఎలా మెజర్ చేయాలి, అందుకనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇక, మీ యూజర్ ఎంగేజ్మెంట్ లెవల్స్ను మెరుగుపరచడానికి మీరు తీసుకోదగిన కొన్ని చర్యలను పరిశీలిద్దాం.
- ఒక అంచనాతో, టెస్టింగ్ ప్రాతిపదికన మొదలుపెట్టండి ఉదాహరణకు, మీరు మీ పేజీ వీక్షణల కొలమానాన్ని మెరుగుపరచాలి అని భావిస్తుంటే, మీ ఆర్టికల్స్ చివర యూజర్లకు నచ్చడానికి అవకాశం ఉన్న మరో కంటెంట్కు తీసుకెళ్లే లింక్లను జోడిస్తూ ఈ టెస్టింగ్ను అమలు చేయవచ్చు. అప్పుడు మీరు, ఎటువంటి కంటెంట్, మెసేజ్లు లేదా ఇతర అనుభవాలు కస్టమర్లను ఎక్కువగా ఎంగేజ్ చేస్తాయో (దాంతో పాటు సంతోషపరుస్తాయో) చూడటానికి Google Optimize వంటి టూల్ను ఉపయోగించి A/B టెస్టింగ్లను త్వరితగతిన సెటప్ చేయవచ్చు.
- బౌన్స్ రేట్లను గమనిస్తూ ఉండండి మీ పేజీలలో దేనిలోనైనా ఒక దానిలో చాలా ట్రాఫిక్ ఉన్నప్పటికీ అధిక బౌన్స్ రేట్ ఉన్నట్లు మీ ఎనలిటిక్స్ చూపిస్తే, మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం పడవచ్చు. ఉదాహరణకు, మీరు మీ పేజీ లోడ్ సమయాలను వేగవంతం చేయాల్సి రావచ్చు లేదా మీ నావిగేషన్ను సులభతరం చేయాల్సిన అవసరం ఉండొచ్చు. వ్యక్తులు మీ బ్లాగును చదవకుండా నిరోధించే పాప్-అప్లు ఏమైనా ఉన్నాయా? మీ సైట్లో ల్యాండ్ అయినప్పుడు సౌండ్, ఆటోమేటిక్గా ఎనేబుల్ అయ్యే ఏర్పాటు ఉందా? మొబైల్ పరికరాలలో చదవడానికి మీ సైట్ ఏ మేరకు సులభంగా ఉంది? ఇలాంటి సమస్యలన్నీ మీ బౌన్స్ రేట్ను ప్రభావితం చేయగలవు, కాబట్టి ప్రతి ఒక్క దాన్ని చెక్ చేయండి, టెస్టింగ్లు చేస్తూ ఫలితాలను బట్టి మెరుగుపరుస్తూ వెళ్లండి, ఆ క్రమంలో వాటి ప్రభావాన్ని మెజర్ చేయండి.
- మీరు వార్తల పబ్లిషరా? అయితే, మీ యూజర్ల లాయల్టీని పెంచుకోవడానికి, వారికి సంబంధించి మెరుగైన, మరింత ఖచ్చితమైన డేటాను సమీకరించడంలో సహాయపడేందుకు, News Consumer Insightsను ఉపయోగించడానికి ట్రై చేయండి.
గమనించవలసిన కొన్ని విషయాలు
ముందుగా పరిశ్రమ బెంచ్మార్క్లను రన్ చేయండి
మీ సైట్ యూజర్ ఎంగేజ్మెంట్ లెవల్స్ను మెజర్ చేసే ముందు, మీ నిర్దిష్ట పరిశ్రమకు సంబంధించిన బెంచ్మార్క్లను ఎల్లప్పుడూ చెక్ చేయండి. ఇది మీ సైట్ పనితీరును ఇండస్ట్రీ బెంచ్మార్క్తో పోల్చడానికి, ప్రోగ్రెస్ను ట్రాక్ చేయడంలో మీకు సహాయపడటానికి, ఏదైనా పరిష్కరించాల్సిన సమస్య ఉన్నట్లయితే ఫ్లాగ్ చేయడానికి మీకు ఒక కొలమానం లాగా ఉపయోగపడుతుంది. అలా చేయడాన్ని మొదలుపెట్టడానికి తగిన చోటు Google Analytics; ఇది మీ సైట్ బౌన్స్ రేట్, ఇతర పనితీరు డేటాను 1,600 కంటే ఎక్కువ రకాల విభిన్న పరిశ్రమ కేటగిరీలతో పోల్చడానికి మీకు వీలు కల్పిస్తుంది.
బౌన్స్ రేట్లను తప్పుగా అర్థం చేసుకోకండి
బౌన్స్ రేట్లు ఉపయోగకరమైన కొలమానం, అయితే వాటిని సందర్భానుసారంగా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు, ఒక యూజర్ మీ వెబ్సైట్లోని ఒక పేజీని మాత్రమే సందర్శించి వెళ్లిపోతే, మీ కంటెంట్ తగినంతగా ఎంగేజింగ్గా లేదని మీరు అనుకోవచ్చు. అయితే సదరు యూజర్ సందర్శించిన పేజీలో కంటెంట్ చాలా ఎక్కువగా ఉండి, తత్ఫలితంగా కొన్ని నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయాన్ని మీ సైట్లో గడిపి ఉన్నట్లయితే, అటువంటి సందర్భంలో కేవలం ఒక పేజీని మాత్రమే సందర్శించారు అనే భావనను తీసుకోవడం అన్నది తప్పుదారి పట్టించేది కావచ్చు. ఇటువంటి పరిస్థితిలో స్క్రోల్ డెప్త్ అన్నది మెరుగైన, మరింత వివరంగా ఉండే గణాంకాలతో కూడిన కొలమానంగా ఉపయోగపడుతుంది.
పేజీ కొలమానంలో సమయాన్ని నిశితంగా పరిశీలించండి
బౌన్స్ రేట్ల మాదిరిగానే, పేజీలోని సమయం కూడా కొంచెం తప్పుదారి పట్టించేలా ఉండవచ్చు.
ఇటువంటి సందర్భాన్ని ఊహించుకోండి. ఒక యూజర్ మీ హోమ్ పేజీలోకి ప్రవేశించినప్పుడు, మీ ఎనలిటిక్స్ టూల్ సమయాన్ని ఇంతని నోట్ చేస్తుంది (ఉదాహరణకు) 11:05 am. ఇదే యూజర్ అక్కడ ఒక నిమిషం పాటు ఉండి, ఆపై మీ సైట్లోని మరొక పేజీకి క్లిక్ చేస్తారు. మళ్లీ, మీ ఎనలిటిక్స్ టూల్ సమయాన్ని 11:06amగా నోట్ చేస్తుంది. పూర్తి ఐదు నిమిషాలు అక్కడ ఉన్న తర్వాత, యూజర్ మీ సైట్ నుండి పూర్తిగా నిష్క్రమిస్తారు - సైట్లో వారు మొత్తం గడిపిన సమయం వావ్ అనేలా ఆరు నిమిషాలు అవుతుంది.
కానీ సమస్య ఏమిటంటే, ప్రతి ఎనలిటిక్స్ టూల్ సైట్లోని మొత్తం సమయాన్ని కేవలం ఒక నిమిషంగా తప్పుగా నమోదు చేస్తుంది. ఇలా ఎందువల్ల? ఎందుకంటే ఈ టూల్స్ మీ స్వంత పేజీలతో మాత్రమే 'మాట్లాడగలవు', ఇతర వెబ్సైట్లలోని పేజీలతో కాదు. కాబట్టి యూజర్ మరొక సైట్కు నిష్క్రమించినప్పుడు, ఆ కొత్త వెబ్సైట్ మీకోసం చివరి పేజీలో గడిపిన సమయాన్ని లెక్కించడానికి టైమ్ స్టాంప్ను తిరిగి పంపదు. ఎనలిటిక్స్ టూల్ విషయానికొస్తే, యూజర్ మీ హోమ్పేజీలో ఒక నిమిషం పాటు ఉండి, ఆపై నిష్క్రమించారు.
అసలుకు మించి కొలవకుండా ఉండేందుకు ట్రై చేయండి
యూజర్ ఎంగేజ్మెంట్ లెవల్స్ను మెరుగుపరచాలని నిర్ణయించుకోవడం ఖచ్చితంగా సానుకూల పరిణామం. అయితే మీరు పలు రకాల కొలమానాలను ఒకేసారి ట్రై చేయకుండా, మెజర్ చేయకుండా ఉండటం అన్నది ముఖ్యమైన విషయం. మీ ఆదాయంపై సానుకూల ప్రభావం ఉన్నట్లుగా చూపిన ఒకే ఒక్క కొలమానాన్ని గుర్తించడం అన్నది చాలా మెరుగైన అంశం - అది సైట్లోని సమయం, షేర్చేయడం లాంటిది ఏదైనా సరే - ఆపై బెంచ్మార్క్ను నిర్ధారించుకుని, మీరు కోరుకున్న ఫలితాలను అందించే టెస్టింగ్లను క్రియేట్ చేయడంపై దృష్టి పెట్టండి.
మీ సైట్ యూజర్ అనుభవాన్ని, పనితీరును, ఆదాయం పొందే అవకాశాన్ని మెరుగుపరచడంపై మరిన్ని రిసోర్స్ల కోసం, మా రిసోర్స్ల విభాగానికి వెళ్ళండి.